Amaravati: వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయలేదు: స్పీకర్‌ అయ్యన్న

ఐదేళ్లు పాలించిన వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వేయలేదని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

Published : 05 Jul 2024 15:02 IST

అమరావతి: ఐదేళ్లు పాలించిన వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వేయలేదని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అమరావతిలోని ఎమ్మెల్యేల క్వార్టర్స్‌, అసెంబ్లీ పరిసరాలను ఆయన పరిశీలించారు. స్పీకర్ వెంట ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, విష్ణుకుమార్ రాజు, అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ స్పీకర్ హోదాలో నిర్మాణ దశలో ఉన్న ఎమ్మెల్యేల క్వార్టర్లను పరిశీలించినట్టు చెప్పారు.

2014-19 మధ్య ఈ భవనాల నిర్మాణం వేగంగా జరిగిందన్నారు. వైకాపా పాలనలో నిర్మాణాలు ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదని విమర్శించారు. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కూడా దొంగలించారని ఆరోపించారు. వీటిని పూర్తిచేయడానికి రూ.380 కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. రాబోయే 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌ పూర్తయ్యే విధంగా చూడాలని కోరామన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇటువంటి రాజధాని ఎక్కడా లేదని.. అధికారులు సహకరించి నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని