Nimmala: కృష్ణాడెల్టాకు సాగునీరివ్వడం ఆగస్టు వరకు సాధ్యం కాదు: మంత్రి నిమ్మల

కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరివ్వడం ఆగస్టు వరకు సాధ్యం కాదని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

Updated : 05 Jul 2024 17:35 IST

అమరావతి: కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరివ్వడం ఆగస్టు వరకు సాధ్యం కాదని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు. ‘‘పులిచింతల ప్రాజెక్టులో గతంలో 40 టీఎంసీలు నిల్వ ఉంచుకొని వాడుకునే వాళ్లం. ప్రస్తుతం పులిచింతలలో అర టీఎంసీ కూడా లేదు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు కొంచెం తాగు, సాగునీరు ఇవ్వగలుగుతున్నాం. ఐదేళ్లుగా నిర్వహణ సరిగా లేక పట్టిసీమ మోటార్లు పనిచేయడం లేదు. జగన్‌ పరిపాలన వల్ల జలవనరులశాఖ బాగా నష్టపోయింది. అసమర్థ పాలన వల్ల సాగునీటి ప్రాజెక్టులు 20 ఏళ్లు వెనక్కి వెళ్లాయి. పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం.

‘‘ఈవీఎం బద్దలు కొట్టడం తప్పు కాదని జగన్ మాట్లాడటం దారుణం. ఈవీఎంలను బద్దలు కొట్టడమంటే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడమే. ఈవీఎంలను ధ్వంసం చేసిన నిందితుడి తప్పేమీ లేదని జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఈసీ సుమోటోగా కేసు పెట్టాలని కోరుతున్నాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజలనే తప్పు పడుతున్నారు. జగన్ ఇలాగే ఉంటే మొన్న మూడంకెల్లో రెండే మిగిలాయి. భవిష్యత్తులో రెండు నుంచి ఒక సంఖ్య మాత్రమే మిగులుతుంది’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు