AP News: వినతుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా

ప్రజల నుంచి వినతుల స్వీకరణకు కొత్తగా టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. 

Updated : 30 Jun 2024 18:18 IST

మంగళగిరి: ప్రజల నుంచి వినతుల స్వీకరణకు కొత్తగా టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎంకు వినతులు ఇచ్చేందుకు జనం పొటెత్తుతున్నారని చెప్పారు. వారు వినతుల స్వీకరణ సులభతరం చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రజలు వారి సమస్యలను 73062 99999 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేస్తే.. ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జగన్‌ పింఛన్‌దారుల్ని మభ్యపెట్టారని పల్లా విమర్శించారు. జగన్‌ ఐదేళ్లలో రూ.వెయ్యి పెంచి హడావుడి చేశారని, చంద్రబాబు ఒకేసారి రూ. వెయ్యి పెంచి లబ్ధిదారులకు మేలు చేశారని అన్నారు. పెంచిన పింఛను సోమవారం పంపిణీ చేస్తామని తెలిపారు. అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తామని, విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చుతామని స్పష్టం చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని