Chandrababu: ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు.

Updated : 04 Jul 2024 15:56 IST

దిల్లీ: దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈనెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా, రాష్ట్ర పునర్‌నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. గత ప్రభుత్వం విధ్వంసంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రధాన మంత్రికి నివేదించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరడంతో పాటు మౌలిక వసతుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలని కోరారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంతో పాటు, కీలక రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, జల్‌జీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ తాగునీటి సరఫరా వంటి ముఖ్యమైన అంశాలపై విజ్ఞప్తులు చేశారు.

ప్రధానితో సమావేశానికి ముందు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసిన సీఎం.. ఆ తర్వాత మరికొందరు మంత్రులను కలిసి వినతులు సమర్పించారు. కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్‌, బీసీ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు  ఎంపీలు చంద్రబాబు వెంట ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని