Mukesh Kumar Meena: లెక్కింపు కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే

ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా హెచ్చరించారు.

Published : 31 May 2024 04:22 IST

సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా

మచిలీపట్నం కౌంటింగ్‌ కేంద్రంలోని ఏర్పాట్లను ముకేశ్‌కుమార్‌ మీనాకు వివరిస్తున్న కృష్ణాజిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ, అధికారులు 

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. కేంద్రం వెలుపల సైతం 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. కౌంటింగ్‌ రోజున ఎలాంటి అల్లర్లకూ తావులేకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గురువారం మచిలీపట్నం కృష్ణావిశ్వవిద్యాలయంలోని కౌంటింగ్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రంలో చేసిన ఏర్పాట్లు, కల్పించిన సదుపాయాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. జూన్‌ 4న సాయంత్రం 5 గంటల్లోపు ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆ తరువాత గెలిచిన అభ్యర్థులకు ధ్రువపత్రాల జారీ, ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలింపు.. ఇలా అన్ని ప్రక్రియలు రాత్రి 9 గంటల్లోపే పూర్తిచేయడానికి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఎవరూ ఊరేగింపులు, ర్యాలీలు చేయడానికి అనుమతులు లేవన్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ, జేసీ గీతాంజలిశర్మ, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయింఅస్మీ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు