Andhra news: విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయండి: కేంద్రమంత్రిని కోరిన భాజపా ఎంపీలు

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అంశంపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖమంత్రి కుమారస్వామిని దిల్లీలో బుధవారం ఏపీ భాజపా ఎంపీలు కలిశారు.

Updated : 26 Jun 2024 17:48 IST

దిల్లీ: వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అంశంపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖమంత్రి కుమారస్వామిని దిల్లీలో బుధవారం ఏపీ భాజపా ఎంపీలు కలిశారు. రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి నేతృత్వంలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌లు.. కుమారస్వామితో సమావేశమై చర్చించారు. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. స్టీల్‌ ప్లాంట్‌ను లాభాలబాట పట్టించే అంశాలపై చర్చించారు. అందుకు సంబంధించిన ప్రణాళికను కేంద్ర మంత్రికి వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలని కోరారు. భాజపా ఎంపీలు చెప్పిన అంశాలపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి.. మరోసారి సమావేశమవుదామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు