AP Assembly Exit Poll: ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌... మై యాక్సిస్‌ ఇండియాటుడే అంచనాలివే

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారం కైవసం చేసుకోబోతోందని కీలక సర్వేలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Updated : 02 Jun 2024 20:01 IST

India Today Exit Poll (హైదరాబాద్‌): ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారం కైవసం చేసుకోబోతోందని కీలక సర్వేలు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మై యాక్సిస్‌ ఇండియా టుడే సర్వే (india today exit poll andhra pradesh) కూడా వచ్చి చేరింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ సొంతంగా 78-96 స్థానాల్లో విజయం సాధిస్తుందని, మిత్రపక్షాలు జనసేన 16-18 స్థానాల్లో, భాజపా 4-6 స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేసింది. ఇక అధికార వైకాపా 55-77 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన తర్వాత పూర్తిగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌కు 0-2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఇండియా టుడే సర్వే ప్రకారం కూటమికి 98-120 స్థానాలు.. వైకాపా 55-77, కాంగ్రెస్‌ 0-2 స్థానాల్లో విజయం సాధించే అవకాశముంది. ఇక పార్టీల వారీగా ఓటు షేర్‌ చూస్తే, తెదేపా 42శాతం, వైకాపా 44 శాతం, జనసేన 7శాతం, భాజపా 2శాతం, కాంగ్రెస్‌ 2 శాతం, ఇతరులు 3శాతం ఓట్లను షేర్‌ చేసుకుంటారని అభిప్రాయపడింది. లోక్‌సభకు సంబంధించి తెదేపా 13-15, జనసేన 2, భాజపా 4-6 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉండగా, అధికార  వైకాపా 2-4 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని