Congress: కేసీఆర్‌పై విశ్వాసం లేకే కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు: ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్

భారాస అధ్యక్షుడు కేసీఆర్‌పై విశ్వాసం లేకపోవడంతోనే ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

Updated : 05 Jul 2024 13:31 IST

హైదరాబాద్‌: భారాస అధ్యక్షుడు కేసీఆర్‌పై విశ్వాసం లేకపోవడంతోనే ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిందెవరో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. గతంలో మాదిరిగానే కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్‌ మాట్లాడారు. 

ఆగస్టు 15లోపు రూ.31వేల కోట్లతో రైతు రుణమాఫీ చేస్తామని శ్రీనివాస్‌ తెలిపారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కనుందని చెప్పారు. రైతును రాజు చేయడమే తమ ధ్యేయమన్నారు. రైతు భరోసా అమలుపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. పదేళ్ల భారాస పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయని విమర్శించారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరారని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని