Telugu Times Business Excellence Awards 2024: ఘనంగా ‘తెలుగు టైమ్స్‌బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డుల’ వేడుక

Telugu Times Business Excellence Awards 2024: ఎన్నారై తెలుగు బిజినెస్‌ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడమే ‘తెలుగు టైమ్స్‌’ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డుల ముఖ్య ఉద్దేశం

Updated : 21 Jun 2024 17:14 IST

గత 21 ఏళ్లుగా అమెరికాలోని తెలుగువారికి మీడియాపరంగా సేవలందిస్తోంది ‘తెలుగు టైమ్స్‌’. గతేడాది నుంచి తెలుగు బిజినెస్‌మెన్‌లను అవార్డులతో (Telugu Times Business Excellence Awards 2024) సత్కరించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. ఎన్నారై తెలుగు బిజినెస్‌ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమని తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌, సీఈవో చెన్నూరి వెంకట సుబ్బారావు అన్నారు. జూన్‌ 16న డల్లాస్‌ వేదికగా జరిగిన ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. అమెరికా, ఇండియా జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన కార్యక్రమంలో తెలుగు టైమ్స్‌ పత్రికను ప్రారంభించడం వెనుక ఉన్న నేపథ్యాన్ని ఎడిటర్‌, సీఈవో చెన్నూరి వెంకట సుబ్బారావు వివరించారు.

తానా మాజీ అధ్యక్షుడు ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ.. తెలుగు టైమ్స్‌, చెన్నూరి వెంకట సుబ్బారావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం వేడుకలకు హాజరైన ప్లానో మేయర్‌ జాన్‌ బి.మున్స్‌ ఇర్వింగ్‌, ఫ్రిస్కో సిటీ నుంచి వచ్చిన అధికారులను ఆహ్వానించి వారిని పరిచయం చేశారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా వచ్చిన భారత కాన్సుల్‌ జనరల్‌, డి.సి.మంజునాథ్‌ను నీల్‌ గొనుగొంట్ల వేదికపైకి ఆహ్వానించారు. వ్యాపార రంగంలో తెలుగువాళ్లు చేస్తున్న కృషిని భారత కాన్సుల్‌ జనరల్‌ డి.సి. మంజునాథ్‌ ప్రశంసించారు. విప్రోలో ఎంటర్‌ప్రైజ్‌ ఫ్యూచరింగ్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మెంబర్ నాగేంద్ర బండారు కీ నోట్‌ స్పీకర్‌గా హాజరై మాట్లాడారు. గ్రోత్‌ ఈక్విటీ హెడ్‌ రాజా దొడ్డాల గౌరవ అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై వక్తలు ప్రసంగించారు. ఈ చర్చా కార్యక్రమానికి పర్యవేక్షకుడిగా ఇంటెల్‌ సాఫ్ట్‌ టెక్నాలజీస్‌ సీఈవో సతీష్‌ మండవ వ్యవహరించారు. యూఎస్‌ ఇండియా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (డీఎఫ్‌డబ్ల్యూ)కు చెందిన నీలిమ గొనుగుంట్ల, నాట్స్‌ మాజీ ప్రెసిడెంట్‌ బాపయ్య నూతి, నాటా మాజీ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌రెడ్డి కొర్సపాటి తదితరులు పాల్గొన్నారు. నాగేంద్ర బండారు స్పాన్సర్లకు, పార్టనర్‌లకు జ్ఞాపికలను అందజేశారు. సురేష్‌ మండవ, సతీష్‌ బండారు (టాంటెక్స్‌), శ్రీధర్‌ బెండపూడి (ఐటీ బ్లూబర్డ్‌), శేషు కల్రా (సాఫ్ట్‌ కీస్‌ ఇంక్‌), వెంకటేశ్వర చిన్ని (పెలికాన్‌ వ్యాలీ), కృష్ణ కోరాడ (అప్లాజ్‌) తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. తెలుగు టైమ్స్‌ డైరెక్టర్‌ సీవీబీ కృష్ణ వోట్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌ చెప్పారు. శ్రావ్య వేములపాటి చెన్నూరి తన యాంకరింగ్​తో అందర్నీ ఆకట్టుకున్నారు.

  • అవార్డు గ్రహీతల వివరాలివే
  • ఐటీ సర్వీసెస్‌ విభాగం - శ్రీకాంత్‌ గడ్డం, ప్రెసిడెంట్‌, ఈఆర్‌పీఏ (కొలంబస్‌, ఒహాయో)
  • హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ విభాగం - డా. యోగి చిమట, డల్లాస్‌ రెనాల్‌ గ్రూపు (డల్లాస్‌)
  • వెంచర్‌ క్యాపిటల్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ - దయాకర్‌ పుష్కర్‌, సీఈవో-డల్లాస్‌ వెంచర్‌ క్యాపిటల్‌ (డల్లాస్‌)
  • కమ్యూనిటీ సర్వీసెస్‌ - బాల ఇందుర్తి, ప్రెసిడెంట్‌, శంకర నేత్రాలయ (యూఎస్‌ఏ)
  • సినిమా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగం - అనిల్‌ సుంకర, నిర్మాత, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, డల్లాస్‌
  • ఐటీ ప్రొడక్ట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం - కిరణ్‌ పాశం, ప్రెసిడెంట్‌-ఫ్లాష్‌ బిఐ, అట్లాంటా
  • లీగల్‌ సర్వీసెస్‌ విభాగం - గీత దమ్మన, అటార్నీ దమ్మన లా (డల్లాస్‌)
  • రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ - విజయ్‌ బొర్రా, డీఎఫ్‌డబ్ల్యూ ల్యాండ్‌
  • హోటల్‌-రెస్టారెంట్‌ విభాగం - రమేష్‌ గాదిరాజు, ఎ2బి స్వీట్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌
  • ఐటీ స్టాపింగ్‌ - మహేశ్వర్‌ కాసా, ప్రెసిడెంట్‌, కెకె సాఫ్ట్‌వేర్‌ అసోసియేట్స్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని