అడిలైడ్‌లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు.

Published : 02 Jul 2024 16:23 IST

అడిలైడ్‌: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ప్రజా కూటమి విజయోత్సవాల పేరిట వేడుకలు నిర్వహించారు. తెదేపా-జనసేన-భాజపా కూటమి విజయం సాధించిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలతో కూటమి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.  సిడ్నీ యువ చిత్రకారిణి కుమారి సుమ గొలగాని చేతితో గీసిన చంద్రబాబు చిత్రపటానికి వేలం నిర్వహించగా.. దీన్ని మెల్‌బోర్న్‌ వాసి గోగినేని బాబు 35,000 (550$)కు దక్కించుకున్నారు. గత రెండేళ్ల నుంచి అడిలైడ్‌ నగరంలో తెదేపా అభిమానులు అందించిన సహకారానికి, సమయానికి దక్షిణ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్‌ నవీన్‌, నేలవల్లి ప్రత్యేక అభిందనలు తెలిపారు.

రామోజీరావుకు ఘన నివాళి 

ఇటీవల కన్నుమూసిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీ రావుకు ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రామోజీరావు లాంటి వ్యక్తి తెలుగువారిగా పుట్టడం తెలుగు ప్రజల అదృష్టమని కొనియాడారు. ఒక నియంతను మట్టికరిపించేందుకు చివరి క్షణం వరకు అక్షర పోరాటం చేసిన యోధుడిగా చిరస్మరణీయులుగా నిలిచిపోతారని పలువురు ఎన్నారైలు అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని