- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NRI News: అమెరికాలోని ఫీనిక్స్‌లో ‘ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్’ ప్రారంభం
అమెరికాలో ప్రవాసాంధ్రుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించి బలమైన సామాజిక భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA)ను ఏర్పాటు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ప్రవాసాంధ్రుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించి బలమైన సామాజిక భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA)ను ఏర్పాటు అయింది. దీనికి సంబంధించి జూన్ 19న అరిజోనాలోని ఫీనిక్స్(Phoenix)లో ‘ఫీనిక్స్ ఛాప్టర్’ ప్రారంభ సమావేశం నిర్వహించారు. కళ్యాణ్ గొట్టిపాటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి సుమారు 100 మంది ప్రవాసీయులు హాజరయ్యారు. నాగ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. వాసు కొండూరు తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నాయకత్వ బృందం హరి మోతుపల్లి (వ్యవస్థాపకులు), బాలాజీ వీర్నాల (గవర్నింగ్ బోర్డు), కళ్యాణ్ కార్రీ (గవర్నింగ్ బోర్డు), రవి చిక్కాల (గవర్నింగ్ బోర్డు), గిరీష్ అయ్యప్ప (న్యూజెర్సీ చాప్టర్ అధ్యక్షుడు), సత్య వేజ్జు (ప్రెసిడెంట్-ఎలెక్ట్, న్యూజెర్సీ), వీరభద్ర శర్మ (పెన్సిల్వేనియా చాప్టర్ అధ్యక్షుడు), ప్రదీప్ సెట్టిబలిజ (డెలావేర్ చాప్టర్ అధ్యక్షుడు), హరి తూబాటి (డెలావేర్ ప్రెసిడెంట్-ఇలెక్ట్) సంఘం లక్ష్యాలను వివరించారు.
ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను సంరక్షించడం, వాటి ప్రాముఖ్యతపై చర్చలు జరిగాయి. భోగి, సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి వంటి పండుగలలో ఉన్న ఏకత్వం, కలిసి ఉండాలనే భావనపై ప్రసంగించారు. వీటిని భవిష్యత్తు తరాలకు అందించడానికి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో కళ్యాణ్ గోట్టిపాటి, నాగ, వసు కొండూరు, జయరాం కోడె, మధు అన్నె, నరేంద్ర పర్వతరెడ్డి, నాగేంద్ర వుప్పర, రమేష్ కుమార్ సురపురెడ్డి, రాజమోహన్ సందెళ్ళ, పుల్లారావు గ్రాంధి, సాయిబాబు, భాను తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్‌లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్‌లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్‌లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్‌లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్‌లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. -
మౌంటైన్ హౌస్‌లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ..
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది. -
న్యూయార్క్‌లో ఘనంగా కూటమి సంబరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ ప్రజావిజయాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. -
అట్లాంటాలో కూటమి విజయదరహాసం.. రామోజీరావుకు ఘన నివాళి
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు. -
అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం..!
తెలంగాణకు చెందిన వెంకట్ ఆరేళ్ల క్రితం ఓ ప్రముఖ ఐఐటీలో ఇంజినీరింగ్ చేశారు. అనంతరం అమెరికాలో ఎంఎస్ చేసి, అక్కడే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. -
కూటమి సునామి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎన్నారై తెదేపా టంపా టీమ్
ఏపీలో కూటమి సునామి వేడుకలను ‘ఎన్నారై తెదేపా టంపా టీమ్’ ఘనంగా నిర్వహించింది. టంపాలోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 250 మంది సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఏపీలో కూటమి ప్రభుత్వం.. మిన్నెసోటాలో ఎన్నారైల సంబరాలు
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అద్భుత విజయం సాధించడం సహా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కూటమి ఎన్నారై కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు.
-
ఘనంగా ‘తెలుగు టైమ్స్బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల’ వేడుక
Telugu Times Business Excellence Awards 2024: ఎన్నారై తెలుగు బిజినెస్ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడమే ‘తెలుగు టైమ్స్’ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ముఖ్య ఉద్దేశం -
డాలస్‌లో పద్మవిభూషణ్ రామోజీరావుకు ఘన నివాళి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. -
రాయల్ ఆస్కాట్‌లో అబ్బురపరిచిన రేసు గుర్రాలు
బ్రిటన్‌లో అత్యంత ప్రసిద్ధిగాంచిన రాయల్ ఆస్కాట్ రేస్ కోర్స్‌లో గుర్రపు పందేలు అబ్బుర పరుస్తున్నాయి. -
కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు
అమెరికా సౌత్ కరోలినాలోని కొలంబియా నగరంలో దశావతార వేంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. -
మిన్నియాపోలిస్‌లో మిన్నంటిన ఎన్డీయే కూటమి విజయోత్సవ సంబరాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అఖండ విజయంతో అమెరికాలోని ఎన్నారైలు సంబరాలు చేసుకొంటున్నారు. -
భారత దేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతార
భారతదేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతారగా ఎప్పటికీ గుర్తుంటారని పలువురు వక్తలు ప్రశంసించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆధార్ ఫొటోకి మోడల్‌గా మారి ఫోజులిచ్చిన చిన్నారి.. వీడియో వైరల్
-
‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్‌పై మండిపడ్డ శిందే!
-
ఎన్సీడబ్ల్యూ ఫిర్యాదు.. ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదు
-
జింబాబ్వే చిత్తు.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
-
మణికొండ డ్రగ్స్ కేసు.. పట్టుబడిన వారిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు
-
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి