Zara Hatke Zara Bachke: విక్కీ కౌశల్‌.. ‘జర హట్‌ కే జర బచ్‌ కే’

విక్కీ కౌశల్‌, సారా అలీఖాన్‌ జోడీగా లక్ష్మణ్‌ ఉతెకర్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘జర హట్‌ కే జర బచ్‌ కే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Updated : 15 May 2023 11:34 IST

విక్కీ కౌశల్‌, సారా అలీఖాన్‌ జోడీగా లక్ష్మణ్‌ ఉతెకర్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘జర హట్‌ కే జర బచ్‌ కే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని విక్కీ కౌశల్‌ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దాంతోపాటు విక్కీ కౌశల్‌, సారా అలీఖాన్‌లతో కూడిన ఒక ప్రచార వీడియోను సైతం ఈ సందర్భంగా విడుదల చేశాడు. ‘ఈ వీడియో రొమాంటిక్‌గా ఉందా.. డ్రామాటిక్‌గా ఉందా.. మీకెలా అనిపిస్తోంది? మా కథ ఎలా ఉండనుందో ఈరోజు విడుదలయ్యే ట్రైలర్‌లో చూడండి’ అంటూ ఓ క్యాప్షన్‌ని జోడించాడు. మ్యాడోక్‌ స్టూడియోస్‌ పతాకంపై దినేష్‌ విజన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్‌ 2న విడుదల కానుంది.

‘మేరే మెహ్‌బూబ్‌.. మేరే సనమ్‌’?

మరోవైపు విక్కీ కౌశల్‌, తృప్తీ దిమ్రీ నాయకానాయికలుగా ఆనంద్‌ తివారీ తెరకెక్కిస్తున్న చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి ‘మేరే మెహ్‌బూబ్‌.. మేరే సనమ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు సమాచారం. అయితే దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో అమీ విర్క్‌ కీలక పాత్ర పోషించనున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని