Yash 19: మీరంతా గర్వపడే సినిమా చేస్తా.. తన తర్వాతి సినిమాపై యశ్‌ కామెంట్స్‌

హీరో యశ్‌ (Yash) తర్వాతి ప్రాజెక్ట్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన కామెంట్స్ చేశారు.

Published : 25 Nov 2023 10:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కేజీఎఫ్‌’ సినిమాలతో గ్లోబల్‌ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు యశ్‌ (Yash). ‘కేజీఎఫ్‌2’ విడుదలై ఏడాదిన్నర కావస్తున్నా.. ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్‌ గురించి ప్రకటన చేయలేదు. తాజాగా ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ తన తర్వాతి సినిమా (Yash 19) గురించి యశ్‌ స్పందించారు.

‘‘నేనేం విశ్రాంతి తీసుకోవడం లేదు. నా ఫ్యాన్స్‌కు సగం ఉడికించిన ఆహారాన్ని అందించడం నాకు ఇష్టం లేదు. అందరూ గర్వపడేలా సినిమా తీస్తా. ఇంకాస్త ఓపిక పట్టండి’’ అని చెప్పారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే మిగిలింది. గతంలో కూడా తన తర్వాతి సినిమా గురించి యశ్‌ మాట్లాడుతూ చాలా కష్టపడుతున్నట్లు చెప్పారు. అభిమానుల అంచనాలకు తగ్గట్లు సినిమా తీస్తానని హామీ ఇచ్చారు. కానీ, దాని వివరాలు మాత్రం చెప్పలేదు.

అన్నదమ్ముల మధ్య ఇగోలు ఉండకూడదు: మంచు మనోజ్‌

ఇక ‘కేజీఎఫ్‌2’ (KGF2) తర్వాత యశ్ నటించనున్న సినిమాలపై చాలా రూమర్స్‌ వస్తున్నాయి. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌తో ఆయన చర్చలు జరిపారని.. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా రానుందని వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. అలాగే బాలీవుడ్‌లో రూపొందనున్న రామాయణం సినిమాలోనూ యశ్ రావణుడిగా కనిపించనున్నాడని కూడా టాక్. దీనికి సంబంధించి కూడా చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ రాకీభాయ్‌ తర్వాతి సినిమాపై సందిగ్ధత నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని