Vijayendra Prasad: నా ఫస్ట్‌ క్రష్‌ చేసిన పనికి గుండె ఝల్లుమంది: విజయేంద్ర ప్రసాద్‌

తన ఫస్ట్‌క్రష్‌ చేసిన పనికి గుండె ఝల్లుమంది అని ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. ‘ఓ సాథియా’ టీమ్‌తో మాట్లాడుతూ బాల్య జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.

Published : 03 Jul 2023 21:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్‌ (Vijayendra Prasad) తన ఫస్ట్‌ క్రష్‌ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ‘ఓ సాథియా’ (O Saathiya) చిత్ర బృందంతో సంభాషిస్తూ నాటి సంగతులు పంచుకున్నారు. ‘ఈ సినిమా ఫస్ట్‌లవ్‌ నేపథ్యంలో రూపొందింది. మీ ఫస్ట్‌లవ్‌ గురించి చెబుతారా?’ అని టీమ్‌ అడగ్గా విజయేంద్ర ప్రసాద్‌ ఇలా సమాధానమిచ్చారు. ‘‘సాధారణంగా దాన్ని లవ్‌ అని అంటుంటాం. కానీ, అది లవ్‌ కాదు క్రష్‌. నా ఫస్ట్‌క్రష్‌ పేరు రాధ. నేను ఫోర్త్‌ ఫారం చదివే రోజులవి. అప్పుడు నా వయసు సుమారు 11 ఏళ్లు. ఆమె నాకంటే పెద్దది. చాలా అందంగా ఉండడంతో ట్యూషన్‌ క్లాస్‌లో ఆమెను చూస్తూ ఉండేవాణ్ని. దాన్ని గమనించిన ఆమె మాస్టర్‌ దగ్గరకు వెళ్లి నాపై కంప్లైంట్‌ చేసింది. దాంతో, నా గుండె ఝల్లుమంది. అయితే, నేనంటే ఆ సర్‌కి ఇష్టం. ‘ప్రసాద్‌ నీ వైపు చూస్తున్నాడని నీకెలా తెలుసు?’ అని ఆయన రాధని ప్రశ్నించారు. ‘నేను చూశాను’ అని తాను సమాధానం చెప్పడంతో.. ‘మరి, ప్రసాద్‌ని నువ్వెందుకు చూశావ్‌’ అని ఆయన తిరిగి ప్రశ్నించారు’’ అని ట్యూషన్‌లో చేసిన అల్లరిని విజయేంద్ర ప్రసాద్‌ వివరించారు.

ఆర్యన్‌ గౌరా (Aryan Gowra), మిస్తీ చక్రవర్తి (Mishti Chakravarty) జంటగా నటించిన ‘ఓ సాథియా’కి విజయేంద్ర ప్రసాద్‌ శిష్యురాలు దివ్య భావన (Divya Bhavana) దర్శకత్వం వహించారు. ఈ నెల 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా విజయేంద్ర ప్రసాద్‌ ఆ చిత్ర బృందంతో ముచ్చటించారు. మనిషిలో చిత్తశుద్ధి ఉంటే లక్ష్యానికి దారులు తప్పక ఉంటాయని, దానికి ప్రకృతి సహకరిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘బజరంగీ భాయిజాన్’, ‘బాహుబలి’, ‘మణికర్ణిక’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’వంటి ఎన్నో హిట్‌ చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్‌ ప్రస్తుతం..హీరో మహేశ్‌ బాబు (Mahesh Babu)- దర్శకుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకి స్టోరీ రాస్తున్నారు. గ్లోబల్‌ అడ్వెంచర్‌గా రూపొందనున్న ఆ సినిమాకి  #SSMB29 వర్కింగ్‌ టైటిల్‌ ప్రచారంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని