Swapna Dutt: ప్రేమతో తీస్తాం... రికార్డుల కోసం కాదు!

అగ్ర తారల సినిమాలు విడుదలైతే చాలు... సినీ ప్రేమికులు,  అభిమానులు రికార్డుల గురించి ఆరా తీయడం మొదలుపెడతారు. సామాజిక మాధ్యమాల్లో వాటి గురించే చర్చలు సాగుతుంటాయి.

Published : 29 Jun 2024 01:09 IST

గ్ర తారల సినిమాలు విడుదలైతే చాలు... సినీ ప్రేమికులు,  అభిమానులు రికార్డుల గురించి ఆరా తీయడం మొదలుపెడతారు. సామాజిక మాధ్యమాల్లో వాటి గురించే చర్చలు సాగుతుంటాయి. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల తర్వాత కూడా ఇదే వరసే. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ, వసూళ్లతో హోరెత్తిస్తోంది. అయితే ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్‌ రికార్డుల సంగతిని ప్రస్తావిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ని పంచుకున్నారు. ‘‘మనం రికార్డుల్ని అధిగమించామా? అని అడుగుతుంటే ఆశ్చర్యంగా, గమ్మత్తుగా ఉంది. రికార్డుల్ని ఎవ్వరైతే సృష్టించారో వాళ్లెవ్వరూ కూడా  రికార్డుల కోసమని  సినిమాలు తీయలేదు. ప్రేక్షకుల కోసం,  సినిమాపై ఉన్న ప్రేమతోనే మేం సినిమాలు తీస్తుంటాం’’ అంటూ ఆ పోస్ట్‌లో అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని