Chiranjeevi: శరవేగంగా ‘విశ్వంభర’.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే!

చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ అప్‌డేట్‌ వచ్చేసింది.

Published : 04 Jul 2024 13:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా దీనిపై నిర్మాణసంస్థ ఓ అప్‌డేట్‌ షేర్‌ చేసింది. సినిమా డబ్బింగ్‌ వర్క్‌ మొదలైనట్లు తెలిపింది. దీనికి సంబంధించిన పనులు ఈరోజు ప్రారంభమయ్యాయని పేర్కొంది. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలిపింది. ప్రేక్షకులంతా జనవరి 10న అద్భుతమైన అనుభూతిని పొందడానికి సిద్ధంగా ఉండాలని కోరింది. 

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘విశ్వంభర’ తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలిచిపోనుంది. అంతేకాదు, సోషియో ఫాంటసీ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉండనున్నట్లు ఎప్పటినుంచో టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో స్టార్‌ హీరోయిన్‌ త్రిష (Trisha), ఆషికా అధికారికంగా జాయిన్‌ అయ్యారు. సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. 

ఘనంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ రిసెప్షన్‌.. తారల సందడి

ఆ ఆనవాయితీని మరోసారి గుర్తుచేశారు: చిరంజీవి

సంగీత దర్శకుడు కీరవాణికి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘విశ్వంభర’ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌కు సంబంధించిన వీడియోను ఆయన పంచుకున్నారు. ‘గతంలో పాటలు కంపోజ్‌ చేయాలంటే డైరెక్టర్‌ ఆధ్వర్యంలో మూవీ టీమ్‌ అంతా కూర్చొని పాటల గురించి చర్చించేది. ఆ తర్వాత పాటను ఫైనల్‌ చేసేవారు. కానీ, ఇప్పుడు ఆ రోజులు మారిపోయాయి. ‘విశ్వంభర’తో మళ్లీ ఆ ఆనవాయితీని కీరవాణి గుర్తుచేశారు’ అని ఆ వీడియోకు చిరు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ ఇచ్చారు. ఈరోజే జన్మించిన మా ‘ఆస్కారుడు’ కీరవాణికి (MM Keeravaani) పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని