Vishwak Sen: అమ్మాయిగా ‘విష్వక్‌ సేన్‌’.. కొత్త సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే!

విష్వక్‌ సేన్‌ కొత్త సినిమా ‘లైలా’ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. విష్వక్‌ ఇందులో అమ్మాయిగా కనిపించనున్నారు.

Published : 03 Jul 2024 12:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్న కథలతో అలరిస్తుంటారు యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌. ఆయన ఇటీవల ‘లైలా’ (Laila) అనే కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దాని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం అది చర్చనీయాంశంగా మారింది.

ప్రతి సినిమాకు వైవిధ్యాన్ని చూపించే విష్వక్ ఈ సినిమాలో అమ్మాయిగా కనిపించనున్నారు. అయితే కొన్ని సన్నివేశాల్లోనే అలా కనిపిస్తారా.. లేదంటే ఎక్కువ భాగం అలానే అలరిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ‘తన అందమైన కళ్లతో.. మనోహరమైన రూపంతో ఈ లైలా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది’ అంటూ విష్వక్‌ సేన్ (Vishwak Sen) లేడీ గెటప్‌లో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి ఇదొక విభిన్నమైన రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు అర్థమవుతోంది. దీంట్లో కథానాయిక పాత్రకు కూడా మంచి ప్రాధాన్యముందని సమాచారం. దీనితో పాటు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో విష్వక్‌ ‘మెకానిక్‌ రాకీ’లో నటిస్తోన్నారు. రాకీగా ఆయన లుక్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుంది.

ఈ ఏడాది ప్రయోగాత్మక చిత్రాలు.. ఏ సినిమా ఏ ఓటీటీలో?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు