Vijay Deverakonda: అర్జునుడిగా నేను.. ప్రభాస్‌ కర్ణుడు.. అలాగే చూడండి: విజయ్‌ దేవరకొండ

కల్కి మూవీలో తన పాత్ర గురించి నటుడు విజయ్‌ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Published : 01 Jul 2024 00:12 IST

హైదరాబాద్‌: ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో భారతీయ సినిమా మరో స్థాయికి వెళ్లిందని విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) అన్నారు. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు మూడు రోజుల్లో రూ.415 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ‘కల్కి’లో అర్జునుడి పాత్రలో కనిపించి అలరించారు విజయ్‌ దేవరకొండ. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన తన పాత్ర గురించి మాట్లాడారు.

‘‘కల్కి’ సినిమా చూశా. చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఇండియన్‌ సినిమా మరో స్థాయికి వెళ్లింది. నాగీ, ప్రభాస్‌ అన్న గురించి చేసిన పాత్ర అది. అర్జునుడిగా మూవీ చివరిలో కనిపించడం, ఆ పాత్ర చేయడం నాకు సంతోషంగా ఉంది. తెరపై విజయ్‌ దేవరకొండ, ప్రభాస్‌ అన్నట్లు చూడొద్దు. నన్ను అర్జునుడిగా.. ఆయనను కర్ణుడిగా మాత్రమే చూడాలి. నాగీ యూనివర్స్‌లో మేము పాత్రలు చేస్తున్నాం. నాగీ ప్రతి సినిమాలో నేను చేయడం తను లక్కీఛార్మ్‌ అని చెప్పొచ్చు. సినిమాలు బాగున్నాయి కాబట్టి నడుస్తున్నాయి. నేను చేయడం వల్లే అతడి సినిమాలు ఆడటం లేదు. ‘మహానటి’ ‘కల్కి’ రెండూ గొప్ప సినిమాలు. అందులో మేం నటించామంతే’’ అని చెప్పుకొచ్చారు. ‘‘కల్కి పార్ట్‌-2’లో మీ పాత్ర ఇంకాస్త ఎక్కువ ఉంటుందని నిర్మాత అశ్వనీదత్‌ చెప్పారు. మరి మీరేమంటారు’’ అని ప్రశ్నించగా,  ‘ఆయన ఏది చెబితే అది కరెక్ట్‌’ అని విజయ్‌ దేవరకొండ సమాధానం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని