vijay sarkar movie: ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!

ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనదే అంటూ ‘సర్కార్‌’లో ఓటు ప్రాధాన్యం గురించి విజయ్‌ చెప్పిన డైలాగ్‌ ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది.

Updated : 12 May 2024 17:13 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన తెలుగు వాళ్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ సొంతూళ్లకు చేరుకుంటున్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఇప్పటికే ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేసింది. పలు సినిమాల్లోనూ ఓటు హక్కు ప్రయోజనాన్ని తెలియజేస్తూ దర్శకులు సన్నివేశాలను తీర్చిదిద్దారు. అలాంటి వాటిలో విజయ్‌ నటించిన ‘సర్కార్‌’ ఒకటి. మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో విజయ్‌ ఓటు ప్రయోజనాన్ని తెలిపే సీన్‌ హైలైట్. ప్రస్తుతం ఓట్ల పండగ నడుస్తున్న సందర్భంగా ఆ సీన్‌ను మీరూ చూసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని