Vijay: ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’.. సిద్ధం

‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’తో థియేటర్లలో సందడి చేయనున్నారు తమిళ కథానాయకుడు విజయ్‌.

Published : 23 Jun 2024 00:43 IST

‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’తో థియేటర్లలో సందడి చేయనున్నారు తమిళ కథానాయకుడు విజయ్‌. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని వెంకట్‌ ప్రభు తెరకెక్కించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. శనివారం విజయ్‌ 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో ఓ ఛేజింగ్‌ సీక్వెన్స్‌ను చూపించారు. ఆఖర్లో విజయ్‌ తండ్రీ కొడుకులుగా బైక్‌పై ఫైరింగ్‌ చేస్తూ కనిపించిన తీరు ఆకర్షణగా నిలిచింది. సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలతో నిండిన ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలిసింది. ఇది సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని