Katrina Kaif: ఆ విషయం చెప్పడానికి మేం సిగ్గుపడం: కత్రినా ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై విక్కీ

కత్రినా ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై ఆమె భర్త విక్కీ కౌశల్‌ స్పందించారు. అలాంటి శుభవార్త ఉంటే స్వయంగా వెల్లడిస్తామన్నారు.

Published : 29 Jun 2024 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ప్రెగ్నెంట్‌ అంటూ కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలపై ఆమె భర్త విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) స్పందించారు. తన కొత్త చిత్రం ప్రమోషన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రూమర్‌ గురించి మాట్లాడారు. ‘అలాంటి శుభవార్త ఉంటే మేమే స్వయంగా మీతో పంచుకుంటాం. సరైన సమయం వచ్చినప్పుడు మేం ఆ విషయాన్ని చెప్పడానికి సిగ్గుపడం’ అని చెప్పారు.

ఇక పెళ్లి తర్వాత తనలో వచ్చిన మార్పులపై విక్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెళ్లి తర్వాత ప్రతిఒక్కరిలో మార్పు వస్తుంది. మరో వ్యక్తితో కలిసి జీవితాన్ని ప్రారంభించడం చాలా పెద్ద విషయం. అప్పటివరకు మన కోసం ఆలోచిస్తాం.. వివాహం అనంతరం ఇద్దరి గురించి ఆలోచించాలి. ప్రతీ నిర్ణయం ఇద్దరికీ అనుగుణంగా తీసుకోవాలి. నా 36 ఏళ్ల జీవితంలో మొదటి 33 ఏళ్ల కంటే గత రెండున్నరేళ్లలోనే ఎంతో ఉన్నతంగా ఆలోచించడం ప్రారంభించాను. వివాహం తర్వాత ఎన్నో విషయాల్లో మార్పు వచ్చింది’’ అని చెప్పారు. కత్రినా (Katrina Kaif) - విక్కీలు 2021 డిసెంబర్‌లో ఒక్కటైన విషయం తెలిసిందే.

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అర్జున్‌: ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’పై శంకర్‌ ఏమన్నారంటే?

విక్కీ కౌశల్‌ త్వరలోనే ‘బ్యాడ్‌ న్యూజ్‌’తో (Bad Newz) అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆనంద్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రీ, అమీ విర్క్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా రానున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ జులై 19న ప్రేక్షకుల ముందుకురానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని