Vennela Kishore: నవ్వుల గూఢచారి

హాస్యనటుడిగానే కాకుండా... అప్పుడప్పుడూ కథానాయకుడిగానూ సినిమాలు చేస్తుంటారు వెన్నెల కిశోర్‌. ‘చారి 111’ చిత్రంతో మరోసారి కథానాయకుడిగా అలరించనున్నారు.

Updated : 24 Aug 2023 13:56 IST

హాస్యనటుడిగానే కాకుండా... అప్పుడప్పుడూ కథానాయకుడిగానూ సినిమాలు చేస్తుంటారు వెన్నెల కిశోర్‌. ‘చారి 111’ చిత్రంతో మరోసారి కథానాయకుడిగా అలరించనున్నారు. టీజీ కీర్తికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితి సోని నిర్మిస్తున్న చిత్రమిది. వెన్నెల కిశోర్‌కి జోడీగా సంయుక్త విశ్వనాథన్‌ నటిస్తున్నారు. మురళీశర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బుధవారం సినిమాని ప్రకటించడంతోపాటు, కాన్సెప్ట్‌ టీజర్‌ని విడుదల చేశారు. ‘‘ఈ సినిమాలో గందరగోళంతో కనిపించే గూఢచారి పాత్రలో వెన్నెల కిశోర్‌ నవ్వులు పంచనున్నారు. మురళీశర్మ మాజీ ఆర్మీ అధికారి ప్రసాద్‌రావుగా కనిపిస్తారు. యాక్షన్‌ కామెడీ కథతో రూపొందుతున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనల్ని ఛేదించే వైనం, రహస్య గూఢచారి పాత్రలో ఆయన స్టైలిష్‌ లుక్‌ అలరిస్తుంది. ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని పంచుతుంది’’ అన్నారు దర్శకుడు. చిత్ర నిర్మాత అదితి సోని మాట్లాడుతూ ‘‘స్పై జానర్‌ సినిమాల్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. కథలో ఆశ్చర్యపరిచే విషయాలు చాలా ఉన్నాయి. ఇందులో ప్రతినాయకుడు ఎవరనేది కీలకం. చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది’’ అన్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్య, రాహుల్‌ రవీంద్రన్‌ తదితరులు నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని