Venkatesh: వెంకీ సరసన ఐశ్వర్య

కథానాయకుడు వెంకటేశ్, అనిల్‌ రావిపూడి కలయికలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ నాయికగా మీనాక్షి చౌదరిని ఇప్పటికే ఎంపిక చేశారు.

Published : 02 Jul 2024 02:02 IST

థానాయకుడు వెంకటేశ్, అనిల్‌ రావిపూడి కలయికలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ నాయికగా మీనాక్షి చౌదరిని ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో నాయిక పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ని తీసుకున్నట్లు తెలిపారు దర్శకుడు అనిల్‌రావిపూడి. సోమవారం బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టును స్వామి వారి పాదాల వద్ద ఉంచి, పూజలు చేశారు. అనంతరం అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో వెంకటేశ్‌ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఈ నెల 3 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. నవంబరులో పూర్తిచేసి వచ్చే సంక్రాంతికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

న్యూస్‌టుడే, గరకొండ(అద్దంకి)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని