Venkatesh: మూడు పాత్రలతో..

వెంకటేశ్‌ - అనిల్‌ రావిపూడి కలయిక అనగానే ‘ఎఫ్‌2’, ‘ఎఫ్‌3’ చిత్రాలు గుర్తొస్తాయి. ముచ్చటగా మూడో చిత్రం కోసం ఆ ఇద్దరూ జట్టు కట్టారు. ఈసారి మూడు పాత్రల చుట్టూ సాగే కథతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు.

Published : 04 Jul 2024 01:30 IST

వెంకటేశ్‌ - అనిల్‌ రావిపూడి కలయిక అనగానే ‘ఎఫ్‌2’, ‘ఎఫ్‌3’ చిత్రాలు గుర్తొస్తాయి. ముచ్చటగా మూడో చిత్రం కోసం ఆ ఇద్దరూ జట్టు కట్టారు. ఈసారి మూడు పాత్రల చుట్టూ సాగే కథతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. వెంకీ సరసన కథానాయికలుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా, డి.సురేశ్‌బాబు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ని అందించారు. ‘‘కథానాయకుడు, ఆయన భార్య, ఆయన మాజీ ప్రియురాలు చుట్టూ సాగే నేర నేపథ్యమున్న కథ ఇది. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం రంగంలోకి దిగార’’ని చిత్రవర్గాలు చెప్పాయి. ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నరేశ్, వి.టి.గణేశ్, మురళీధర్‌ గౌడ్, పమ్మి సాయి, సాయిశ్రీనివాస్, ఆనంద్‌రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేశ్‌ బాలరాజ్, ప్రదీప్‌ కాట్రా, చిట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ప్రొడక్షన్‌ డిజైన్‌: ఎ.ఎస్‌.ప్రకాశ్, కూర్పు: తమ్మిరాజు, యాక్షన్‌ డైరెక్టర్‌: వి.వెంకట్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని