Varuntej-Lavanya: చిరంజీవి నివాసంలో మొదలైన ప్రీవెడ్డింగ్‌ వేడుకలు.. ఫొటోలు వైరల్‌

శుక్రవారం సాయంత్రం చిరంజీవి నివాసంలో ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరిగాయి. కొణిదెల కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

Updated : 07 Oct 2023 13:52 IST

హైదరాబాద్‌: నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun Tej), నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. శుక్రవారం సాయంత్రం చిరంజీవి నివాసంలో ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరిగాయి. కొణిదెల కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. కొత్త జంటకు అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తాజాగా చిరంజీవి నెట్టింట షేర్‌ చేశారు. ‘‘వరుణ్‌తేజ్‌ లావణ్యల ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ నిన్న సాయంత్రం వేడుకగా జరిగాయి’’ అని ఆయన పేర్కొన్నారు. #MomentsToCherish హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి.

2017లో విడుదలైన ‘మిస్టర్‌’ కోసం వరుణ్‌ - లావణ్య తొలిసారి కలిసి పనిచేశారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఏడాదిలోనే వీరి కాంబినేషన్‌లో ‘అంతరిక్షం’ వచ్చింది. ఈ క్రమంలోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. ‘‘దాదాపు ఐదారేళ్ల నుంచి మేమిద్దరం స్నేహితులం. తను నా బెస్ట్‌ ఫ్రెండ్‌. నాకు ఏం ఇష్టమో తనకు బాగా తెలుసు. మా అభిరుచులు కలవడంతో రిలేషన్‌లోకి వచ్చాం. నేనే మొదట ప్రపోజ్‌ చేశా. ఇరు కుటుంబాలు మా నిర్ణయాన్ని అంగీకరించాయి. నిశ్చితార్థం మాదిరిగానే పెళ్లి కూడా సింపుల్‌గా ఉంటుంది’’ అని వరుణ్‌తేజ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ నెలలోనే వీరి పెళ్లి జరగవచ్చని తెలుస్తోంది. కుటుంబసభ్యులు, అతి తక్కువమంది బంధువుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఉండొచ్చని సమాచారం.

Bhola Shankar: ‘భోళా శంకర్‌’ విషయంలో అదే ప్రమాదకరంగా మారింది

ఇక, వరుణ్‌ తేజ్‌ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’లో నటిస్తున్నారు. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యథార్థ సంఘటనల ఆధారంగా, ఓ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ సరసన అందాల భామ మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) నాయికగా కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు