Varun Sandesh: అందుకే ఆ సినిమా ఆడలేదు.. సుకుమార్‌ ప్రశంసలను మర్చిపోలేను: వరుణ్‌ సందేశ్‌

దర్శకుడు సుకుమార్‌ ప్రశంసలనును ఎప్పటికీ మర్చిపోలేనన్నారు నటుడు వరుణ్‌ సందేశ్‌. కొత్త సినిమా ‘నింద’ ప్రచారంలో భాగంగా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

Published : 22 Jun 2024 17:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను గతంలో నటించిన ‘ఎవరైనా ఎపుడైనా: ప్రేమలో పడొచ్చు’ (Evaraina Epudaina) సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారస్థాయిలో నమోదయ్యాయని, అయితే వాటిని ఆ చిత్రం అందుకోలేకపోయిందని వరుణ్ సందేశ్‌ (Varun Sandesh) అన్నారు. తనకు బాగా ఇష్టమైన మూవీస్‌లో అదొకటి చెప్పారు. తాజా చిత్రం ‘నింద’ (Nindha) ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.

‘‘హ్యాపీడేస్‌’, ‘కొత్త బంగారులోకం’ వరుస విజయాలు అందుకోవడంతో.. తదుపరి చిత్రమైన ‘ఎవరైనా ఎపుడైనా’పై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ రెండింటికీ మించి ఉంటుందని ప్రేక్షకుల థియేటర్లకు వెళ్లారు. మంచి సినిమా అయినప్పటికీ అది ఊహించిన స్థాయిలో విజయం అందుకోలేదు. కానీ, నటుడిగా సంతృప్తినిచ్చింది. ఆ సినిమా విషయంలో దర్శకుడు సుకుమార్‌ (Director Sukumar) ఫోన్‌ చేసి నన్ను ప్రశంసించడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ చిత్రంలోని పలు కామెడీ సీన్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో కనిపిస్తుండడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

‘‘హీరో సిద్ధార్థ్‌ని మీరు భర్తీ చేయబోతున్నారనే టాక్‌ మీ కెరీర్‌ ప్రారంభంలో వినిపించింది..’’ అని యాంకర్ ప్రస్తావించగా వరుణ్‌ స్పందించారు. ఎవరూ ఎవరినీ రీప్లేస్‌ చేయరని, ఎవరి ప్రత్యేకత వారిదని పేర్కొన్నారు. ‘నింద’ విషయానికొస్తే.. వాస్తవ సంఘటనల ఆధారంగా రాజేశ్‌ జగన్నాథం తెరకెక్కించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌తో సంబంధమున్న వివేక్‌గా వరుణ్‌ నటించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శుక్రవారం విడుదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని