Varalaxmi Sarathkumar: వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి సందడి మొదలైంది.. ఫొటో చూశారా!

అతి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ప్రీ వెడ్డింగ్‌ సెల్రబేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేశారామె.

Published : 30 Jun 2024 18:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) పెళ్లి సందడి మొదలైంది. ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వాటిలోని ఒక ఫొటోలో కాబోయే భర్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ (nicholai sachdev)ను ఆలింగనం చేసుకుంటూ కనిపించారు. ఈ ముందస్తు వివాహ వేడుక ముంబయిలో జరిగినట్టు తెలిసింది. వారు జులై 2న వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. 

వరలక్ష్మి ఫ్యామిలీ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇటీవల కలిసి పెళ్లికి ఆహ్వానించింది. అంతకుముందు.. కోలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులకు వరలక్ష్మి, నికోలయ్ శుభలేఖ అందించి, తమ వివాహానికి రమ్మని కోరారు. శరత్‌ కుమార్‌ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మి. ‘క్రాక్‌’ తదితర చిత్రాల్లో నెగెటివ్‌ పాత్రలు పోషించి విశేషంగా అలరించారు. ముంబయికి చెందిన వ్యాపారవేత్త సచ్‌దేవ్‌తో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని