Varalakshmi: ఘనంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ రిసెప్షన్‌.. తారల సందడి

నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated : 04 Jul 2024 10:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar)- నికోలయ్‌ సచ్‌దేవ్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. థాయ్‌లాండ్‌ వేదికగా జులై 2న వీరి వివాహం జరిగింది. తాజాగా చెన్నైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌ నటీనటులు ఈ రిసెప్షన్‌లో సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ వధూవరులను ఆశీర్వదించారు. బాలకృష్ణ (Balakrishna), వెంకటేశ్‌, రజనీకాంత్‌ (Rajinikanth), సిద్ధార్థ్‌, ఖుష్బూ, శోభన, మంచు లక్ష్మి రిసెప్షన్‌లో సందడి చేశారు.

సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనా తన వైవిధ్యమైన నటన, పాత్రలతో వరలక్ష్మి అలరించారు. ఇక నికోలయ్‌ సచ్‌దేవ్‌ ముంబయికి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్‌ గ్యాలరీలను నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్‌ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులు విక్రయిస్తుంటారు. 14ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. తాజాగా వివాహబంధంతో ఒక్కటయ్యారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని