Upasana: అలాంటి వాళ్లను వెనక్కి లాగొద్దు.. విజయ్ పొలిటికల్‌ ఎంట్రీపై ఉపాసన కామెంట్స్‌..

రామ్‌ చరణ్‌ (ram charan) భార్య ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో కోలీవుడ్‌ హీరో విజయ్ పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించారు.

Updated : 08 Feb 2024 16:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన (Upasana ). ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళనాడులో విజయ్‌ (Vijay) రాజకీయ రంగ ప్రవేశంపై కామెంట్ చేశారు. ‘‘సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది రాజకీయాల్లో రాణించారు. ముఖ్యమంత్రులుగా సేవలు చేశారు. విజయ్‌ నటుడిగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే అది చాలా గొప్ప విషయం. సమాజంలో మార్పు రావాలని కోరుకునే లీడర్‌ ఎవరైనా సపోర్ట్‌ చేయాలనేది నా అభిప్రాయం. ఒకవేళ అలాంటి వాళ్లకు సపోర్ట్‌ చేయకపోయినా.. వెనక్కి మాత్రం లాగకూడదు. విజయ్‌ గొప్ప రాజకీయనాయకుడు అవుతారని భావిస్తున్నా’’ అని అన్నారు. ఇక తాను మాత్రం రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. మార్పు తీసుకువచ్చే నాయకుడికి మద్దతు ఇస్తానన్నారు.

ఆ విషయంలో చరణ్‌ని చూసి అసూయ పడుతున్నా: ఉపాసన

సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘‘నేను తెలుగు, తమిళ సినిమాలను సబ్‌ టైటిల్స్‌తో చూస్తాను. ఈ మధ్య అలా చాలా చిత్రాలను చూసి ఎంజాయ్‌ చేశా. ఈ ఏడాది రానున్న ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘ఇండియన్‌ 2’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ సమయంలోనే మాకు పాప పుట్టింది. అందుకే ఆ చిత్రం మాకు ప్రత్యేకం. చరణ్‌ నటించిన ‘ఆర్ఆర్ఆర్‌’కు ఆస్కార్‌ వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌లో వెళితే.. అక్కడ అందరూ నాటునాటు స్టెప్‌ వేసి అలరించారు. అది చూసి చాలా ఆనందమేసింది’’ అని తెలిపారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. కియారా కథానాయిక. ఎస్‌.జె సూర్య, సునీల్‌, శ్రీకాంత్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని