ETV Telugu: ఈటీవీలో రెండు సరికొత్త సీరియల్స్‌

ప్రతి మధ్యాహ్నాన్ని మరింత వినోదభరితంగా మార్చేందుకు మరో రెండు సరికొత్త సీరియల్స్‌ను తీసుకొచ్చింది మీ ఈటీవీ. మనసుకు హత్తుకునే విధంగా రూపొందిన ‘వసంతకోకిల’ మధ్యాహ్నాం 1.30గం.కు, ‘కాంతార’ మ.2గం.కు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం కాబోతున్నాయి.

Updated : 01 Jul 2024 05:40 IST

రేపటి నుంచే ప్రారంభం 

ప్రతి మధ్యాహ్నాన్ని మరింత వినోదభరితంగా మార్చేందుకు మరో రెండు సరికొత్త సీరియల్స్‌ను తీసుకొచ్చింది మీ ఈటీవీ. మనసుకు హత్తుకునే విధంగా రూపొందిన ‘వసంతకోకిల’ మధ్యాహ్నాం 1.30గం.కు, ‘కాంతార’ మ.2గం.కు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం కాబోతున్నాయి.

విధిరాతను మించిన వింత తలరాత

సంధ్య అందరిలాగే అమ్మానాన్నలే ప్రపంచంగా పెరిగిన అమ్మాయి. ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలను మోస్తుంది. ఎన్నడూ వాటిని బరువుగా అనుకోదు. అటు కుటుంబాన్ని ఇటు ఉద్యోగాన్ని ప్రాణంగా భావిస్తుంది. ఆనందంగా సాగిపోతున్న సంధ్య జీవితంలోకి అందాల రాజకుమారుడు ఆకాశ్‌ వస్తాడు. తొలి చూపులోనే సంధ్యను ప్రేమిస్తాడు. సంధ్య తిరస్కరించినా వెంటపడుతూనే ఉంటాడు. ప్రేమను గెలిపించుకోవడానికి ఆకాశ్‌ చేయని ప్రయత్నమంటూ ఉండదు. అసలు ఆకాశ్‌ ప్రేమను సంధ్య తిరస్కరించడానికి కారణం ఏమిటీ..? సంధ్యకు పెళ్లి చేయాలన్న తల్లిదండ్రుల కోరిక నెరవేరుతుందా..? సంధ్య ఎందుకు పెళ్లికి సిద్ధంగా లేదు..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా ఊహకందని మలుపులతో, మనసుని మెలిపెట్టే భావోద్వేగాలతో సాగే ఓ మగువ ప్రయాణం ఈ ‘వసంతకోకిల’ సీరియల్‌. విధిరాతను మించిన వింత తలరాత ఈ కథ. రవిరాథోడ్, పద్మ లక్ష్య, మధు ప్రధాన పాత్రల్లో మల్లెమాల బ్యానర్‌పై తెరకెక్కిన ‘వసంత కోకిల’ సీరియల్‌కు అనిల్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.


మనసు- మాంగళ్యం మధ్య నలిగిన అమ్మాయి 

అందంతో పాటూ అమాయకత్వం నిండిన కాంతారను గోపీ ప్రేమిస్తాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ అనూహ్య పరిస్థితులు వీళ్లను విడదీస్తాయి. యువరాజును కాంతార పెళ్లి చేసుకుంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తిని వదిలి యువరాజును కాంతార ఎందుకు వివాహం చేసుకుంది..? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుందని తెలిసి గోపీ ఏం చేశాడు..? మరొకరితో వివాహం నిశ్చయమైన అమ్మాయిని యువరాజు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది..? ఇలాంటి ఆసక్తికర మలుపులు, భావోద్వేగాల కలబోతకు కమనీయ దృశ్యరూపం ఈ కాంతార. మనసు-మాంగళ్యం మధ్య నలిగిన అమ్మాయి కథ.. ఈ కాంతార!. గౌరవ్, అక్షయ, పవన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈనాడు టెలివిజన్‌ అనేక అద్భుతమైన ధారావాహికలను ప్రేక్షకులకు అందించింది. ఇప్పుడు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని