Nani: ఒకేసారి రెండు సినిమాలతో?

ఈ ఆగస్టులో ‘సరిపోదా శనివారం’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు కథానాయకుడు నాని. దీని తర్వాత ఆయన ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమా చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

Published : 24 Jun 2024 01:09 IST

ఆగస్టులో ‘సరిపోదా శనివారం’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు కథానాయకుడు నాని. దీని తర్వాత ఆయన ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమా చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం సినీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాని ఈ చిత్రంతో పాటే ‘హిట్‌ 3’ని కూడా పట్టాలెక్కించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇది ఆయన సొంత నిర్మాణ సంస్థ వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై నిర్మించనున్నారు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించనున్నారు. తను ఇప్పటికే నానికి కథ వినిపించారని.. అది ఆయనకు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధం చేయమని ఆదేశించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో సాగే ఈ సినిమాలో అర్జున్‌ సర్కార్‌ అనే ఐపీఎస్‌ అధికారిగా కనిపించనున్నారు నాని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు