Tholiprema Re Release: ‘సీఎం.. సీఎం’ నినాదాలతో దద్దరిల్లిన థియేటర్‌.. వీడియోలు వైరల్‌

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన క్లాసిక్‌ మూవీ ‘తొలిప్రేమ’ (TholiPrema) శుక్రవారం రీ రిలీజ్‌ అయ్యింది. ఈ సందర్భంగా ఆయా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Published : 30 Jun 2023 15:35 IST

హైదరాబాద్‌: భారీ కటౌట్లు.. పాలాభిషేకాలు.. తీన్‌మార్‌ డ్యాన్స్‌లు.. హౌస్‌ఫుల్‌ బోర్డులు.. స్టార్‌హీరో నటించిన సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద కనిపించే వాతావరణం ఇది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్ల వద్ద ఇలాంటి పండుగ వాతావరణమే కనిపిస్తోంది. పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) నటించిన ‘తొలిప్రేమ’ (Tholiprema Re Release) రీ రిలీజ్‌ను పురస్కరించుకుని శుక్రవారం ఆయా థియేటర్ల వద్ద సినీ ప్రియులు సెలబ్రేషన్స్‌ చేశారు. సినిమా హాళ్ల వద్ద భారీ కటౌట్స్‌ ఏర్పాటు చేసి తీన్‌మార్‌ డ్యాన్స్‌లేశారు. ఇక థియేటర్ల లోపల కూడా ఇదే తరహా హంగామా కనిపించింది. ఓ థియేటర్‌లో అభిమానులు ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. 

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కెరీర్‌లోని సూపర్‌హిట్‌ చిత్రాల్లో ఒకటి ‘తొలిప్రేమ’ (Tholi Prema). కీర్తిరెడ్డి కథానాయిక. కరుణాకరన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ క్లాసిక్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ విడుదలై 25 ఏళ్లు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా చిత్రబృందం 4కె వెర్షన్‌లో ‘తొలిప్రేమ’ను శుక్రవారం రీ రిలీజ్‌ చేసింది.








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు