Kalki 2898 AD: ‘కల్కి’లో కృష్ణుడిగా కనిపించింది ఈయనే.. ఎవరంటే?

మైథాలజీ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకుల ముందుకు గురువారం వచ్చింది. ఇందులో కృష్ణుడిగా నటించింది ఎవరంటే?

Published : 28 Jun 2024 00:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కథ, విజువల్స్‌తోపాటు ఊహించని అతిథి పాత్రలతో ‘కల్కి 2898 ఏడీ’ (kalki 2898 ad) చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతోంది. ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ఈ మైథాలజీ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో కృష్ణుడిగా నటించిందెవరా? అనేది నెట్టింట హాట్‌ టాపిక్‌ మారింది. కురుక్షేత్రం నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో కృష్ణుడి పాత్రధారి ముఖాన్ని చూపించకపోవడమే ఇందుకు కారణం. ఆ క్యారెక్టర్‌ పోషించిన వ్యక్తి నడక తీరును పరిశీలించి.. కొందరు హీరో నాని అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు ఇతర హీరోల పేర్లు ప్రస్తావించారు. సంబంధిత పోస్ట్‌లపై.. స్వయంగా ఆ క్యారెక్టర్‌ ప్లే చేసిన నటుడే సోషల్‌ మీడియా వేదికగా స్పందించడంతో సమాధానం లభించినట్టైంది. ఆయనే తమిళ నటుడు కృష్ణ కుమార్‌ (కేకే) (Krishnakumar).

ఈయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. డబ్బింగ్‌ చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’తో పలకరించారు. సూర్య హీరోగా రూపొందిన ఈ మూవీలో ఆయనకు స్నేహితుడిగా నటించారు కేకే. ధనుష్‌ ‘మారన్‌’లోనూ కీలక పాత్ర పోషించారు. ‘కాదళగి’తో 2010లో తెరంగేట్రం చేసిన ఆయనకు ‘కల్కి’ ఐదో చిత్రం. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ అర్జునుడిగా నటించి, ఆకట్టుకున్నారు. దర్శకులు రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ, అనుదీప్‌ కేవీ, నటులు దుల్కర్‌ సల్మాన్‌, ఫరియా అబ్దుల్లా తదితరులు ఇతర అతిథి పాత్రల్లో సందడి చేశారు.

‘కల్కి’ రివ్యూ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని