- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
The Great Indian Kitchen Review: రివ్యూ: ది గ్రేట్ ఇండియన్ కిచెన్
The Great Indian Kitchen Review: ఐశ్వర్యరాజేశ్, రాహుల్ రవీంద్రన్ జంటగా నటించిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్ ’ ఎలా ఉందంటే?
The Great Indian Kitchen Review: చిత్రం: ది గ్రేట్ ఇండియన్ కిచెన్; నటీనటులు: ఐశ్వర్య రాజేశ్, రాహుల్ రవీంద్రన్, నందకుమార్, యోగిబాబు తదితరులు; సంగీతం: జెర్రీ సిల్వస్టర్ విన్సెంట్; సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణియన్; ఎడిటింగ్: లియో జాన్ పాల్; నిర్మాత: దుర్గారామ్ చౌదరి, నీల్ చౌదరి; దర్శకత్వం: ఆర్.కణ్ణన్; స్ట్రీమింగ్ వేదిక: జీ5
అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకుని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్‌లోనూ తీర్చిదిద్దారు. గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు ఉందా?
కథేంటంటే: ఐశ్వర్యరాజేశ్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్‌కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంతో ఐశ్వర్య రాజేశ్ అత్తారింట్లో అడుగు పెడుతుంది. కానీ, తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్దిరోజులకే అర్థమవుతుంది. అన్నీ పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు.. ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడళ్లు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్యరాజేశ్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకిరీ మొత్తం ఐశ్వర్యరాజేశ్‌పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి? భర్త, మావయ్య చెప్పినట్లు నడుచుకుందా? ఇంటి పనులతో విసిగి పోయిన ఐశ్వర్య రాజేశ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతి వృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ‘ది గ్రేట్ ఇండియా కిచెన్’. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించి విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కి తమిళ్‌లో రీమేక్ చేశారు. కానీ, మలయాళ ప్రేక్షకులను మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు సరి కదా.. టీవీ సీరియల్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీసి వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్యరాజేశ్- రాహుల్ రవీంద్రన్‌ల వివాహంతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు.. కాదు.. వంటింట్లోకి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెలియింగ్‌గా చెప్పడంలో తప్పు లేదు కానీ, చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లు ఉంటుంది. ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’లో జరిగింది ఇదే.
వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావాల్సినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా.. వేసిన దోసెలే వేస్తూ, చేసిన చెట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ.. ‘మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది’ అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తినింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి, దర్శకుడు కేవలం ఒక దృష్టి కోణం నుంచే సినిమాను చూపించాడు. అయితే, దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళలు పీరియడ్స్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకట్రెండు సన్నివేశాలతో నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే, చాలా కుటుంబాల్లో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి, చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. పతాక సన్నివేశాల్లో ఐశ్వర్యా రాజేశ్ స్పెషల్ సాంగ్ ఎందుకో దర్శకుడికే అర్థంకావాలి.
ఎవరెలా చేశారంటే: భార్యభర్తలుగా ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ తమ పాత్రలో ఒదిగిపోయారు. భార్య అంటే కేవలం ఇంటి పనులు, వంట పనులు, శారీరక సౌఖ్యాలు అందించే వస్తువుగా చూసే వ్యక్తిగా రాహుల్ నటన బాగుంది. ఆధునిక భావాలు కలిగిన అమ్మాయిగా ఐశ్వర్య చక్కగా నటించింది. ఇంట్లో వాళ్లను కాదనలేక సర్దుకుపోయే సగటు మహిళ పాత్రలో ఆమె హావభావాలు బాగున్నాయి. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. సినిమాటోగ్రఫ్రీ, సంగీతంలో పెద్దగా మెరుపులేవీ లేవు. ఈ సినిమా నిడివి గంటన్నర మాత్రమే. అదొక్కటే కాస్త ఉపశమనం. మాతృకను తీసుకుని నేటి యువతకు సరిపోయేలా సినిమాను తీర్చిదిద్దే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆర్.కణ్ణన్ ఆ పనిమాత్రం చేయలేదు. మలయాళంలో ఉన్నది ఉన్నట్లు తీశారు.
బలాలు: + దర్శకుడు ఎంచుకున్న పాయింట్ + నిడివి
బలహీనతలు: - సన్నివేశాల సాగదీత, - బలమైన ఎమోషన్స్ లేకపోవడం, - దర్శకత్వం
చివరిగా: ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’.. దర్శకుడు ఎక్కువ తోమేశాడు!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ‘గురువాయూర్ అంబలనాదయిల్’.. మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
Guruvayoor Ambalanadayil Review: పృథ్వీరాజ్ సుకుమార్, బసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ‘గురువాయూర్ అంబలనాదయిల్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’.. ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎలా ఉంది?
kalki 2898 ad review in telugu: ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
Yakshini review in telugu: వేదిక, రాహుల్ విజయ్, మంచు లక్ష్మీ, అజయ్ కీలక పాత్రల్లో నటించిన ‘యక్షిణి’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
రివ్యూ: పరువు.. నివేదా పేతురాజ్ నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj), నటుడు నరేశ్ అగస్త్య (Naresh Agastya), నాగబాబు (Nagababu) ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘పరువు’ (paruvu). ‘జీ 5’లో విడుదలైన ఈ సిరీస్ రివ్యూ మీకోసం.. -
రివ్యూ: హరోం హర.. సుధీర్‌బాబు ఖాతాలో హిట్ పడిందా?
సుధీర్‌బాబు, మాళవిక శర్మ, సునీల్ కీలక పాత్రల్లో నటించిన ‘హరోం హర’ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మహారాజ.. విజయ్ సేతుపతి 50వ మూవీ మెప్పించిందా?
Maharaja Review: వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న విజయ్‌సేతుపతి కెరీర్లో 50వ చిత్రం ‘మహారాజ’. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఏ మేరకు మెప్పించింది? -
రివ్యూ: మిరల్.. ‘ప్రేమిస్తే’ భరత్ నటించిన చిత్రం భయపెట్టిందా?
ప్రేమిస్తే సినిమా హీరో భరత్ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘మిరల్’. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. రివ్యూ మీకోసం.. -
రివ్యూ: కల్కి.. టొవినో థామస్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉంది?
మలయాళంలో మంచి టాక్ సొంతం చేసుకున్న టొవినో థామస్ యాక్షన్ ఫిల్మ్ ‘కల్కి’ మెప్పించిందా? -
రివ్యూ: మనమే.. శర్వానంద్, కృతిశెట్టిల మూవీ ఎలా ఉంది?
Manamey Movie Review: శర్వానంద్, కృతిశెట్టి జంటగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా మెప్పించిందా? -
రివ్యూ: సత్యభామ.. కాజల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ టాక్ ఏంటి?
కాజల్ ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో వచ్చిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
Mr And Mrs Mahi Review: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా శరణ్ శర్మ తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉంది? -
రివ్యూ: కీచురాళ్ళు.. మలయాళ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
మలయాళంలో విజయవంతమైన ‘కీడమ్’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో ‘కీచురాళ్ళుగా’ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
రివ్యూ: గం గం.. గణేశా.. ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ మూవీ మెప్పించిందా?
Gam Gam Ganesha Review: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటించిన మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: భజే వాయు వేగం.. కార్తికేయ హిట్ కొట్టారా?
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘భజే వాయు వేగం’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే? -
రివ్యూ: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’... మాస్ గెటప్‌లో విష్వక్సేన్ మెప్పించారా...?
విష్వక్సేన్ మాస్ లుక్‌లో నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎలా ఉందో చూద్దాం. -
రివ్యూ: స్వతంత్ర వీర్ సావర్కర్.. రణ్‌దీప్ హుడా నటించిన బయోపిక్ ఎలా ఉంది?
Swatantrya Veer Savarkar review; వినాయక్ దామోదర్ సవార్కర్ జీవిత కథ ఆధారంగా రణ్‌దీప్ హుడా రూపొందించిన ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: క్రూ.. టబు, కరీనా, కృతి సనన్ నటించిన హెయిస్ట్ మూవీ ఎలా ఉంది?
Crew Movie Review: బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ‘క్రూ’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: లవ్ మి.. ఆశిష్, వైష్ణవి చైతన్య నటించిన మూవీ మెప్పించిందా?
Love Me Review Telugu: ఆశిష్, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో అరుణ్ భీమవరపు రూపొందించిన హారర్, రొమాంటిక్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ: ఆరంభం.. డెజావు కాన్సెప్ట్‌తో రూపొందిన మూవీ ఎలా ఉందంటే?
మోహన్ భగత్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఆరంభం’. ఓటీటీ ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
రివ్యూ: రాజు యాదవ్.. గెటప్ శ్రీను హీరోగా చేసిన మూవీ ఎలా ఉంది?
‘జబర్దస్త్’ షోతో పాటు, వివిధ చిత్రాల్లో హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ నటించిన చిత్రం ‘విద్య వాసుల అహం’. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రివ్యూ మీ కోసం..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ పిల్ల చేష్టలు మానుకోవాలి: ప్రధాని మోదీ
-
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య
-
ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పుణె శివారులో ఘోర ప్రమాదం.. తెలంగాణకు చెందిన ఐదుగురి దుర్మరణం
-
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్‌లు.. ఇదీ మన గోప్యత తీరు!
-
షారుక్ ఖాన్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా