tenant ott telugu: మరో ఓటీటీలో టెనెంట్‌.. స్ట్రీమింగ్‌ వేదిక ఇదే..!

tenant ott telugu: సత్యం రాజేశ్‌ కీలక పాత్రలో నటించిన ‘టెనెంట్‌’ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

Published : 28 Jun 2024 17:10 IST

హైదరాబాద్‌: సత్యం రాజేశ్‌ (Satyam Rajesh) కీలక పాత్రలో వై.యుగంధర్‌ తెరకెక్కించిన చిత్రం ‘టెనెంట్‌’ (Tenant). ఎమ్‌.చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మాత. మేఘా చౌదరి కథానాయిక. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇప్పుడు మరో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదికగా ఆహా(Aha)లో జూన్‌ 28వ తేదీ నుంచి ‘టెనెంట్’ (tenant ott telugu) స్ట్రీమింగ్‌ అవుతోంది. సమాజంలో మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసేలా.. బలమైన కథతో ఫ్యామిలీ ఎమోషన్‌ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దారు.

ఇంతకీ కథేంటంటే: గౌత‌మ్ (స‌త్యం రాజేష్‌) సంధ్య‌ను (మేఘా చౌద‌రి) వివాహం చేసుకొని హైద‌రాబాద్‌లో ఫ్యామిలీ పెడ‌తాడు. చక్కగా సాగిపోతున్న వారి కాపురంలో అనుకోకుండా విభేదాలు తలెత్తుతాయి. ఈ క్రమంలో ఒక రోజు సంధ్య‌ హ‌త్య‌కు గుర‌వుతుంది. అదేరోజు గౌత‌మ్ ప‌క్క ఫ్లాట్‌లో ఉండే రిషి (భ‌ర‌త్) కూడా బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నిస్తాడు. మరోవైపు రిషిని ప్రేమించిన వైష్ణ‌వి (చంద‌న‌) క‌నిపించ‌కుండా పోతుంది. సంధ్య‌ను హ‌త్య చేసినందుకు పోలీసుల‌ను గౌత‌మ్‌ను అరెస్ట్ చేస్తారు. మరి సంధ్య‌ను గౌత‌మ్ నిజంగానే హ‌త్య చేశాడా? రిషి, సంధ్య‌కు ఏమైనా సంబంధం ఉందా?ఈ కేసు వెన‌కున్న మిస్ట‌రీని ఏసీపీ (ఎస్తేర్) ఎలా ఛేదించింది? అన్నది చిత్ర కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని