DJ Tillu: ఉర్రూతలూగిస్తున్న ‘డీజే టిల్లు’ డీజే పాట

అతని పేరు టిల్లు. ఆయన డీజే పెడితే దద్దరిల్లుతుంది డ్యాన్సు ప్లోరు! సోకేమో హీరో తీరు, కొట్టేదేమో తీన్‌మార్‌.

Updated : 07 Dec 2022 17:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతని పేరు టిల్లు. ఆయన డీజే పెడితే దద్దరిల్లుతుంది డ్యాన్సు ప్లోరు! సోకేమో హీరో తీరు, కొట్టేదేమో తీన్‌మార్‌. ఆ టిల్లు ఎవరో కాదు యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ. ఈయన హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘డీజే టిల్లు’. అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో టైటిల్ గీతాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. కథానాయకుడి గుణగణాలను వివరిస్తూ సాగుతుందీ గీతం. టిల్లు అంటే ఏంటో ఈ పాట ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు రచయిత కాసర్ల శ్యామ్‌. రామ్‌ మిర్యాల గానం అందరినీ అలరించేలా ఉంది. శ్రీచరణ్‌ పాకాలతో కలిసి రామ్‌ ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో సిద్ధు సరసన నేహాశెట్టి సందడి చేయనుంది. ఈ వినోదాత్మక చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని