Pawan Kalyan: తొలి సినిమా హీరోయిన్‌తో పవన్‌ కల్యాణ్‌.. ఫొటో వైరల్‌

పవన్‌ కల్యాణ్‌, సుప్రియ యార్లగడ్డ కలిసి దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో చూసేయండి..

Updated : 25 Jun 2024 13:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) సినిమాతో తెరంగేట్రం చేసిన పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)- సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) కలిసి దిగిన తాజా ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. నేటి పిక్‌కు నాటి సినిమా స్టిల్‌ జోడించి.. ‘అప్పుడలా.. ఇప్పుడిలా’, ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మళ్లీ కలిశారు’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఈ దృశ్యం ఎక్కడ ఆవిష్కృతమైందంటే?

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM), జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు సోమవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న సుప్రియ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం, వారంతా డిప్యూటీ సీఎంతో ఫొటోలు దిగారు. 1996లో హీరోహీరోయిన్లుగా నటించిన పవన్‌, సుప్రియ.. ఇప్పుడు డిప్యూటీ సీఎం, ప్రొడ్యూసర్‌గా మీట్‌ అవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీరంగం విస్తరణకు ఉన్న అవకాశాలు, తదితర కీలక అంశాలపై నిర్మాతలు చర్చించినట్టు సమాచారం. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్‌కు వారు నివేదించారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ ఉన్నారు. పవన్‌ను కలిసిన వారిలో అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌, డి.సురేశ్‌ బాబు, ఏఎం రత్నం, ఎస్‌.రాధాకృష్ణ, దిల్‌ రాజు, ఎన్వీ ప్రసాద్‌, భోగపల్లి ప్రసాద్‌, డీవీవీ దానయ్య, బన్ని వాసు, నాగవంశీ, రవిశంకర్‌, నవీన్‌ యర్నేని తదితరులు ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని