Sudheer Babu: పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సుధీర్ బాబు..

సుధీర్‌ బాబు కొత్త చిత్రాన్ని ప్రకటించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఇది రూపొందనుంది.

Published : 01 Jul 2024 16:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తాజాగా ‘హరోం హర’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్‌ బాబు (Sudheer Babu) కొత్త చిత్రాన్ని ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా పాన్‌ ఇండియా స్థాయిలో ఇది రూపొందనుంది. వెంట్ కల్యాణ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. అలాగే ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్ నటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా మార్చిలో దీన్ని విడుదల చేయనున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రానున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని మూవీ యూనిట్‌ వెల్లడించింది.

‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్‌కు థ్యాంక్స్‌ చెప్పిన నాగ్‌ అశ్విన్‌

ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘నాకు ఈ సినిమా స్క్రిప్ట్‌ చాలా నచ్చింది. ఏడాది నుంచి ఈ టీమ్‌తో కలిసి ట్రావెల్‌ చేస్తున్నా. కొత్త  కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రేక్షకుల మనసును హత్తుకునే చిత్రమిది’’ అన్నారు. ఆగస్టు 15న దీని ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు