SPY Movie ott: సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ స్పై మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

SPY Movie ott: నిఖిల్ (Nikhil Siddhartha) కథానాయకుడిగా ఎడిటర్ గ్యారీ బీహెచ్  దర్శకత్వంలో తెరకెక్కిన స్పై మూవీ ఓటీటీ వేదికగా విడుదలైంది.

Updated : 27 Jul 2023 16:56 IST

SPY Movie ott: నిఖిల్ (Nikhil Siddhartha) హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'స్పై' (Spy). ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఐశ్వర్య మేనన్ (Iswarya Menon) కథానాయిక. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అనుకోలేక పోయింది. అయితే, ముందుగా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. (spy movie ott release date) ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా గురువారం నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథేంటంటే: జైవర్ధన్ (నిఖిల్) (Nikhil) రా ఏజెంట్. శ్రీలంకలో పనిచేస్తుంటాడు. భారతదేశంపై దాడి ప్రయత్నాల్లో ఉన్న ఉగ్రవాది ఖదీర్ ఖాన్ చనిపోయాడని భావిస్తారంతా. కానీ అతడి నుంచి నష్టం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. చనిపోయాడనుకున్న ఖదీర్ కోసం ప్రత్యేకమైన మిషన్తో జై రంగంలోకి దిగుతాడు. మరి ఖదీర్ దొరికాడా? లేక అందరూ ఊహించినట్టుగానే చనిపోయాడా? ఈ ప్రయత్నంలో ఉన్న జై తన అన్న సుభాష్ (ఆర్యన్ రాజేశ్)ని చంపినవాళ్లని ఎలా కనుక్కున్నాడు? ఈ మిషన్కి ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ అదృశ్యం వెనకున్న రహస్యానికీ సంబంధం ఏమిటనేది మిగతా కథ. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని