ఎస్పీబీ తాజా ఆరోగ్యంపై చరణ్‌ ఏమన్నారంటే?

కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌

Published : 31 Aug 2020 18:59 IST

చెన్నై: కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం ఇంట్లోనే మందులు వాడుతున్నారని తెలిపారు.

‘‘మా అమ్మ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఆమె ఇంటికి వచ్చారు. ప్రస్తుతం మందులు వాడుతున్నారు. నిన్నా ఈరోజూ,నేను ఆస్పత్రికి వెళ్లాను. నాన్న ఆరోగ్యం గురించి వైద్యులు నాకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ఇస్తున్నారు. ఆయన ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉందని తెలిపారు. కొన్ని రోజులుగా మంచానికే పరిమితం కావడంతో కండరాల పునరుత్తేజానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఆయన ఊపిరి తీసుకోవడం కూడా మెరుగుపడింది. మీ ప్రార్థనలు, దీవెనల వల్ల ఆయన త్వరగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఇంటికి వస్తారని ఆశిస్తున్నా. రేపటి నుంచి లాక్‌డౌన్‌ను మరింత సడలించనున్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్క్‌లు పెట్టుకొని, భౌతికదూరం పాటించండి. వైరస్‌ బారినపడిన ప్రతి ఒక్కరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ఎస్పీ చరణ్‌ అన్నారు.

మరోవైపు ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు కూడా ఎస్పీబీ ఆరోగ్యంపై హెల్త్‌బులిటెన్‌ విడుదల చేశాయి. ఇంకా ఆయన ఐసీయూలోనే ఉన్నారని, వెంటిలేటర్‌, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్యుల చికిత్సకు, ఫిజియోథెరపీకి ఆయన చురుగ్గా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని