Veer Rajinikanth: మరో బిడ్డకు జన్మనిచ్చిన సౌందర్య రజనీకాంత్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌, విషాగన్‌ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. ఆ శిశువుకు ‘వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడి’ అని పేరు

Updated : 12 Sep 2022 13:37 IST

చెన్నై: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ (Soundarya Rajinikanth), విషాగన్‌ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. ఆ శిశువుకు ‘వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడి’ అని పేరు పెట్టారు. ఈ మేరకు సౌందర్య రజనీకాంత్‌ ట్వీట్‌ చేశారు.

‘‘దేవుని దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్‌ కృష్ణ తమ్ముడికి నేను, విషాగన్‌ స్వాగతం పలుకుతున్నాం’’ అంటూ సౌందర్య పోస్టులో రాసుకొచ్చారు. వ్యాపారవేత్త అశ్విన్‌ కుమార్‌తో గతంలో సౌందర్య రజనీకాంత్‌కు వివాహమైంది. వారికి  వేద్‌ కృష్ణ జన్మించాడు. అయితే కొన్ని కారణాల వల్ల వారు విడాకులు తీసుకున్నారు. అనంతరం వ్యాపారవేత్త విషాగన్‌ వనంగమూడిని సౌందర్య రాజనీకాంత్‌ 2019లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని