Sonakshi Sinha: సోనాక్షి పెళ్లి సందడి షురూ.. మెహందీ వేడుక ఫొటో వైరల్‌

బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా పెళ్లి సందడి మొదలైంది. మెహందీ వేడుక ఫొటోలు వైరల్‌గా మారాయి.

Published : 22 Jun 2024 14:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటులు సోనాక్షి సిన్హా (Sonakshi Sinha)- జహీర్‌ ఇక్బాల్‌ (Zaheer Iqbal) పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఆ రూమర్స్‌పై ఇద్దరూ ఇప్పటివరకూ స్పందించలేదు. బాలీవుడ్‌ వర్గాల సమాచారం మేరకు.. సోనాక్షి- ఇక్బాల్‌ల వివాహం ఆదివారం జరగనుందని తెలిసింది. ఈనేపథ్యంలో ముంబయిలోని సోనాక్షి ఇంట నిర్వహించిన మెహందీ వేడుక ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ ఫంక్షన్‌కు ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరైనట్టు సమాచారం.

‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’ సినిమాలో కలిసి నటించిన ఇక్బాల్‌, సోనాక్షిల మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. తన కుమార్తె వివాహానికి వెళ్లరంటూ వచ్చిన వార్తలపై ఇటీవల నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించారు. ‘‘ఇది నా ఒక్కగానొక్క కుమార్తె జీవితం. ఆమె అంటే నాకు అమితమైన ప్రేమ. నేనే తన బలం అని ఆమె ఎన్నోసార్లు చెప్పింది. తప్పకుండా తన పెళ్లికి వెళ్తా’’ అని తెలిపారు. అంతకుముందు ఓ సందర్భంలో స్పందిస్తూ.. సోనాక్షి- ఇక్బాల్‌ల ప్రయాణం గురించి తనకేమీ తెలియదనడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు