Kalki 2898 AD: ప్రభాస్‌ 1000 రెబల్‌ స్టార్లతో సమానం: శ్యామలా దేవి కామెంట్స్‌

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి చూశారు. అనంతరం ప్రభాస్‌పై ఆమె ప్రశంసలు కురిపించారు.

Published : 27 Jun 2024 17:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌పై ఆయన పెద్దమ్మ (కృష్ణంరాజు భార్య) శ్యామలా దేవి ప్రశంసలు కురిపించారు. 1000 రెబల్‌ స్టార్లని కలిపితే ఒక ప్రభాస్‌ (Prabhas) అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. గురువారం విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో ఆమె (Shyamala Devi) వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ సినిమాని ఆదరించిన పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌, ఇతర హీరోల ఫ్యాన్స్‌, మా కుటుంబ అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రంలోని ఫైట్లు మరో స్థాయిలో ఉన్నాయి. వాటి గురించి చెప్పేందుకు మాటల్లేవ్‌’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఐమ్యాక్స్‌ వద్ద ప్రదర్శనకు ఉంచిన ‘బుజ్జి’ (సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించారు) వాహనం డ్రైవింగ్‌ సీటులో కూర్చొని, ప్రేక్షకులకు అభివాదం చేశారు. సంబంధిత విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’

మరోవైపు, రేణూ దేశాయ్‌ (Renu Desai) తన కుమారుడు అకీరా నందన్‌, స్నేహితులతో కలిసి అదే ఐమ్యాక్స్‌లో మార్నింగ్‌ షో చూశారు. సినిమా పూర్తయిన తర్వాత తమ గ్యాంగ్‌ అంతా కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. సినిమా బాగుందని, ఫ్యామిలీతో కలిసి వెళ్లమని అభిమానులకు చెప్పారు.

కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది: రాజమౌళి

చివరి 30 నిమిషాల సినిమా తనను కొత్త ప్రపంచలోకి తీసుకెళ్లిందని దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘‘కల్కి’ ప్రపంచాన్ని సృష్టించిన తీరు అమోఘం. తన టైమింగ్‌తో డార్లింగ్‌ ప్రభాస్‌ అలరించాడు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె ఈ సినిమాకి పెద్ద సపోర్ట్‌. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, వైజయంతీ మూవీస్‌ టీమ్‌కు అభినందనలు’’ అని ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో రాజమౌళి అతిథి పాత్రలో సందడి చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని