Sharvari Wagh: ఐదుగంటలు మేకప్‌ వేసుకున్నా!

‘ముంజ్యా’ విజయంలో శార్వరీ వాఘ్‌ది కీలకపాత్ర. ప్రేక్షకుల్ని భయపెట్టి, నవ్వించి మొత్తానికి సినిమాని రూ.వంద కోట్ల క్లబ్‌లో చేర్చింది. కానీ ఈ పాత్ర కోసం తనెంతో కష్టపడ్డానంటోంది.

Published : 04 Jul 2024 01:29 IST

‘ముంజ్యా’ విజయంలో శార్వరీ వాఘ్‌ది కీలకపాత్ర. ప్రేక్షకుల్ని భయపెట్టి, నవ్వించి మొత్తానికి సినిమాని రూ.వంద కోట్ల క్లబ్‌లో చేర్చింది. కానీ ఈ పాత్ర కోసం తనెంతో కష్టపడ్డానంటోంది. ‘‘ముంజ్యా’లో నా పాత్ర గురించి వినగానే చాలా ఉత్సుకతకి గురయ్యా. కథ చాలా కొత్తగా అనిపించింది. షూటింగ్‌ కోసం సెట్‌లో అడుగు పెట్టినప్పుడు మాత్రం కొంచెం ఆందోళనకి గురయ్యా. ఎందుకంటే నా పాత్ర జనాన్ని భయపెట్టాలి. దాంతోపాటు నవ్వించాలి. అలా చేయడం సవాలుతో కూడిన విషయం అని తొందరగానే అర్థమైంది. ఇక ‘ముంజ్యా’లా కనిపించడానికి రోజుకు ఐదుగంటలు మేకప్‌ వేసుకునేదాన్ని. షూటింగ్‌ అయ్యాక తీయడానికే అరగంట పట్టేది. దీనికోసం ప్రత్యేకంగా ఆరుగురు మేకప్‌ ఆర్టిస్టులు పని చేసేవారు. అంత కష్టంగా ఉండేది. కానీ థియేటర్‌లో నా పాత్రకు వస్తున్న స్పందన చూసినప్పుడు ఆ కష్టమంతా దూదిపింజలా తేలిపోయింది’ అంటూ చెప్పుకొచ్చింది. ‘మొదట్లో ముంజ్యా పాత్రను పూర్తిగా కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తో తీర్చిదిద్దాలనుకున్నాం. కానీ తర్వాత  ముఖం, శరీర కదలికలు సహజంగా చిత్రీకరించాం. ఆ పాత్రకి సరిపోయే బాడీలాంగ్వేజ్‌ కోసం నేను, ఆదిత్య సర్‌ ఎన్నోసార్లు కలిసి చర్చించాం. ఆ కష్టానికి ప్రతిఫలంగానే మంచి ఫలితాలొచ్చాయి’ అని ఆనాటి తెర వెనక సంగతులు పంచుకుంది శార్వరీ. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని