Samantha: షారుక్‌ సరసన సమంత?

‘మా ఇంటి బంగారం’గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది అందాల నాయిక సమంత. దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్‌ నటిగా వెలుగొందుతున్న ఈ భామ త్వరలో పూర్తిస్థాయి చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Updated : 24 Jun 2024 04:16 IST

‘మా ఇంటి బంగారం’గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది అందాల నాయిక సమంత. దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్‌ నటిగా వెలుగొందుతున్న ఈ భామ త్వరలో పూర్తిస్థాయి చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అగ్ర కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ ‘డంకీ’ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే కాంబినేషన్‌లోనే మరో సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. షారుక్‌ సరసన నటించేందుకు సమంతను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దేశభక్తి నేపథ్యంలో, యాక్షన్‌ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో నటించేందుకు సమంత ఆసక్తి చూపిస్తున్నట్లు సన్నిహితవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్ర స్క్రిప్ట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. వచ్చే ఏడాది ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని