Satyaprem Ki Katha: సత్య ప్రేమలో కథ

‘భూల్‌ భులయ్యా 2’ సినిమా విజయంతో హిట్‌ కలయికగా నిలిచారు బాలీవుడ్‌ కథానాయకుడు కార్తిక్‌ ఆర్యన్‌, కియారా అడ్వాణీ. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తోన్న మరో ప్రేమకథా చిత్రం ‘సత్య ప్రేమ్‌ కీ కథా’. సమీర్‌ విద్వాన్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Updated : 29 Jun 2023 13:57 IST

‘భూల్‌ భులయ్యా 2’ సినిమా విజయంతో హిట్‌ కలయికగా నిలిచారు బాలీవుడ్‌ కథానాయకుడు కార్తిక్‌ ఆర్యన్‌, కియారా అడ్వాణీ. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తోన్న మరో ప్రేమకథా చిత్రం ‘సత్య ప్రేమ్‌ కీ కథా’ (Satyaprem Ki Katha). సమీర్‌ విద్వాన్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురువారం రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని వివాహా సన్నివేశానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో కార్తిక్‌, కియారా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంటున్నారు. సాజిడ్‌ నడియాద్‌వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సత్యగా కార్తిక్‌, కథగా కియారా పాత్రలు గుర్తుండిపోతాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని