Satyabhama: ఓటీటీలోకి కాజల్‌ ‘సత్యభామ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

కాజల్‌ నటించిన  క్రైమ్‌ థ్రిల్లర్‌  ‘సత్యభామ’ (Satyabhama) ఓటీటీలోకి వచ్చేసింది. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతోందంటే..

Published : 28 Jun 2024 11:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాజల్‌ అగర్వాల్‌ (kajal aggarwal) పోలీసు ఆఫీసర్‌గా నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama). సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి మెప్పించింది. ఇప్పుడీ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా అలరిస్తోంది. నవీన్‌చంద్ర కీలకపాత్రలో కనిపించిన ఈ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌, నాగినీడు, హర్షవర్థన్‌, రవి వర్మ, తదితరులు నటించారు.

సేనాపతికి అప్పుడు 75.. ఇప్పుడు 103.. లాజిక్‌ ఏంటో చెప్పిన శంకర్‌

క‌థేంటంటే: కె.సత్యభామ (Kajal Aggarwal) షీ టీమ్‌లో ఏసీపీ స్థాయిలో ప‌నిచేస్తుంటారు. చూడటానికి శాంతంగా క‌నిపించినా, నేర‌స్థుల నుంచి నిజాలు రాబ‌ట్టడంలో దిట్ట. త‌నకు అప్పజెప్పిన కేసుల్ని అంత సుల‌భంగా వ‌దిలిపెట్టదని పేరు. ర‌చ‌యిత అమరేంద‌ర్ (న‌వీన్‌చంద్ర)ని ఇష్టప‌డి పెళ్లి చేసుకున్న ఆమె వ్యక్తిగ‌త జీవితానికంటే, వృత్తికే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తుంటుంది. షీ టీమ్‌లో ప‌నిచేస్తున్న‌ప్పుడే హ‌సీనా అనే ఓ బాధితురాలు గృహహింస‌ని అనుభ‌విస్తూ సాయం కోసం సత్యభామ ద‌గ్గరికి వ‌స్తుంది. ఆ తర్వాత హ‌సీనా తన భ‌ర్త చేతిలో దారుణ హ‌త్యకి గుర‌వుతుంది. హ‌సీనాతోపాటు, ఎంతోమంది జీవితాల‌తో ఆడుకున్న ఆ నేర‌స్థుడిని ప‌ట్టుకునే క్రమంలో సత్యభామకి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఆ కేసుని ఆమె వ్యక్తిగతంగా తీసుకోవ‌డానికి కార‌ణ‌మేమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని