SSMb29: మహేశ్‌-రాజమౌళిల సినిమాలో పాత్ర.. కట్టప్ప ఏమన్నారంటే!

మహేశ్‌-రాజమౌళిల ప్రాజెక్ట్‌లో (SSMB29) అవకాశంపై నటుడు సత్యరాజ్ మాట్లాడారు. కట్టప్పగా తనను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.

Updated : 31 May 2024 11:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బాహుబలి’ కట్టప్పగా అందరికీ చేరువైన నటుడు సత్యరాజ్‌ (Sathyaraj) . ప్రస్తుతం యంగ్‌ హీరోలతో పోటీ పడుతూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు.  ‘వెపన్‌’(Weapon)తో జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. రాజమౌళి-మహేశ్‌ ప్రాజెక్ట్‌లో అవకాశంపై మాట్లాడారు.

‘రాజమౌళికి (SS Rajamouli) నేను రుణపడి ఉన్నాను. సౌత్‌ ఇండియాలో నన్ను సత్యరాజ్‌గా గుర్తిస్తారు. బాహుబలి తర్వాత ప్రపంచం మొత్తానికి నేను కట్టప్పగా పరిచయమయ్యాను. ఇప్పుడు దీని యానిమేషన్‌ సిరీస్‌ వచ్చాక చిన్నపిల్లలూ నన్ను ఇలానే గుర్తిస్తారు. ‘బాహుబలి’ సినిమాలో నాకు కండలు ఉన్నట్లు చూపించారు. ఇప్పుడు ఈ సిరీస్‌లో వాటిని ఇంకా ఎక్కువగా చూపించారు. పిల్లలందరూ నేను అలానే ఉంటానని అనుకుంటారు. మహేశ్‌తో (Mahesh Babu) తీయనున్న ప్రాజెక్ట్‌లో (SSMB29) పాత్ర కోసం నన్నెవరూ సంప్రదించలేదు. రాజమౌళి నిజంగానే ఇందులో పాత్ర ఇస్తే నేను వెంటనే అంగీకరిస్తాను’ అని అన్నారు.

బాలకృష్ణతో నాకు మంచి అనుబంధం ఉంది: నటి అంజలి

ఇక మోదీ బయోపిక్‌లో నటించనున్నట్లు వచ్చిన వార్తలపై మరోసారి స్పందించారు. ‘మోదీ బయోపిక్‌లో నటించడం లేదు. నేను కొంచెం ఆయనలా కనిపిస్తాను. ఎవరో మా ఇద్దరి ఫొటోలు పక్కపక్కన పెట్టి నేను ఆ బయోపిక్‌లో నటిస్తున్నట్లు కొన్ని ఇమేజ్‌లు చేశారు. అప్పటి నుంచి ఈ వార్త ప్రచారమవుతోంది. ఇందులో నిజం లేదు’ అని అన్నారు. ఇక ‘వెపన్‌’లో సత్యరాజ్ యంగ్‌లుక్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 68 ఏళ్లు. ఈ సినిమాలో ఏఐను ఉపయోగించి 28 ఏళ్ల వయసులో ఎలా ఉంటారో చూపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని