Spirit: స్పిరిట్‌ సన్నాహాలు

‘యానిమల్‌’ విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ఆయన తన తదుపరి సినిమాగా ‘స్పిరిట్‌’ను పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.

Updated : 03 Jan 2024 11:35 IST

‘యానిమల్‌’ విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ఆయన తన తదుపరి సినిమాగా ‘స్పిరిట్‌’ను పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్‌కు సంబంధించిన ప్రాథమిక పనులు దాదాపు పూర్తయినట్లు దర్శకుడు సందీప్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీలైనంత త్వరగా పూర్వ నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు కానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ శక్తిమంతమైన పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని