Samantha: మరో కొత్త సిరీస్‌తో సమంత..

సినిమాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే అగ్రకథానాయిక సమంత.. త్వరలో ‘సిటాడెల్‌:హనీ బన్నీ’తో తనలోని యాక్షన్‌ కోణాన్ని రుచి చూపించడానికి సిద్ధమవుతుంది.

Published : 29 Jun 2024 01:15 IST

సినిమాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే అగ్రకథానాయిక సమంత.. త్వరలో ‘సిటాడెల్‌:హనీ బన్నీ’తో తనలోని యాక్షన్‌ కోణాన్ని రుచి చూపించడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడామె మరో కొత్త వెబ్‌సిరీస్‌కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమెతో కలిసి బాలీవుడ్‌ కథానాయకుడు ఆదిత్య రాయ్‌ కపూర్‌ నటిస్తున్నట్లు సమాచారం. ‘‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘సిటాడెల్‌’ సిరీస్‌ల కోసం రాజ్‌ అండ్‌ డీకేలతో చేతులు కలిపిన సమంత..మరోసారి తన రాబోయే ప్రాజెక్టు కోసం వారితో కలిసి పనిచేయనుంది. పూర్తి యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో వచ్చే సీక్వెన్స్‌ కోసం ఇప్పటికే ఆదిత్య, సమంత కసరత్తులు కూడా ప్రారంభించారు. దీనికి ‘రక్తబీజ్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఆగస్టులో చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని